సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తరచు ఏదొక శారీరక సమస్యతో అనారోగ్యాలు పాలు అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం పరిస్థితి అయన అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. పవన్ ఇటీవల భుజాలకు సర్జరీ చేయించుకోవటం కోసం ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. 2016లో భుజాలకు తగిలిన గాయాలు అశ్రద్ధ చెయ్యడం వల్ల పవన్‌కు ప్రస్తుతం తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అయ్యాయని,చేతులు పైకి ఎత్తాలంటే తీవ్రమైన బాధ పడుతున్నారని డాక్టర్లు తేల్చారు. వెంటనే రెండు భుజాలకు సర్జరీ చేయాలని చెప్పారు. దానిలో భాగంగా తొలుత కుడి భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి నేడు, శనివారం సర్జరీ చేశారు. మూడున్నర గంటలపాటు సర్జరీ సాగింది. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు. పవన్ ప్రస్తుతం ముంబై వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పవన్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు అని ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఈ సమయంలో ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని, తగిన శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
