సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి భీమవరం నియోజకవర్గానికి చెందిన కలిదిండి రామచంద్రరాజు పేరును పరిశీలించాలని కోరుతూ కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి భీమవరం టీడీపీ ఇంచార్జి , మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి కి వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఆయనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి విభజన తరువాత పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాల్లో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషిస్తుందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కలిదిండి రామచంద్రరాజు గారికి అవకాశం కల్పించాలని వినతిలో కోరినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *