సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి తేదీ. 16వ తేదీ నుంచి మొదలైన నామినేషన్ ప్రక్రియ నేటి ఆదివారం సాయంత్రం 18వ తేదీతో ముగియనుంది. అయితే అన్ని పార్టీలలో నామినేషన్స్ అంతా హడావిడి.. గందరగోళం. అయితే తొలి రోజు నుంచే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నామినేషన్స్ వేసే వారిపై దాడులతో భయానక పరిస్థితులునెలకొన్నాయి. లాటి చార్జీలు, పోలీస్ కాల్పులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో నేడు, కూడా హై టెన్షన్ నెలకొంది. పులివెందులలో కాల్పుల ఘటనతో ఆఖరి రోజు ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది నేడు విజయవాడలో జరిగిన కీలక పరిణామాలు గమనిస్తే జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ , మరియు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలమైన సామజిక వర్గం కలిగి, విజయవాడ కు 2 సార్లు పోలీస్ కమిషనర్ గ విధులు నిర్వహించిన ఏవి వెంకటేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీల మద్దతుతో నామినేషన్ వెయ్యడం, మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రను మాజీ సీఎం జగన్ స్వయంగా కలసి తమ వైసీపీ నేతలపై జరుగుతున్నా దాడుల ఫై టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది.
