సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన తిరుమలగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన ద్వారకాతిరుమల వాసుని ఆశ్వయుజ మాస దివ్యబ్రహ్మోత్సవాలు శ్రీవారి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 21న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 28 వరకు నిర్వహిస్తున్నారు. . దీనిలో భాగంగా గత శనివారం రాత్రి జరిగిన ఎదుర్కోలు మహోత్సవాన్ని స్వామివారి నిత్యకల్యాణమండ పంలో అర్చకులు,నిర్వహించగా సుమారు 10వేలు పైగా భక్తులతో శ్రీవారి ఆలయం కిటకిటలాడింది. నేడు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే చిన వెంకన్న కు దేవేరులతో దివ్య కల్యాణమహోత్సవానికి అంగరంగ వైభవంగా అనివేటి మండపంలో ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు.. దీనికి విశేషంగా భక్తులతో పాటు ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ప్రముఖులు నేతలు హాజరు కానున్నారు.
