సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా ప్రజలు ఓటు హక్కును కేంద్ర ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ’ఓటు చోరీ చేస్తుందని నిబంధనలను, చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అని ఆరోపిస్తూ దీనికి నిరసనగా ‘సేవ్ ది వోట్ – సేవ్ ది కంట్రీ’ పేరుతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్ 1న ‘జన్ మార్చ్ అండ్ మెగా ర్యాలీ’ నిర్వహిస్తుట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా నేడు, ఆదివారం ప్రకటించారు. . ఈ మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, వ్యాపారులు, మహిళలు అందరు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.‘ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడాలి. ప్రశ్నించిన వారిపై లాఠీలతో దాడి చేశారు. ఓటు మీది.. పోరాటం కూడా మీదే. రాబోయే 7 రోజుల పాటు ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి. తమ చర్యల ద్వారా పరోక్షంగా మాకు ‘మరింత ప్రచారం’ కల్పిస్తున్నందుకు బీజేపీకి కృతజ్ఞతలు’ అంటూ రాహుల్ పోస్ట్ చేశారు.
