సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రంలో మత్యకారుల గల్లంతులు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేడు, శనివారం పోలవరం వద్ద ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడటం తీవ్ర విచారకరమని సీఎం అన్నారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొమ్ముకొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌ అనే ఐదుగురు చేపలవేటకు వెళ్లి మరణించినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. మృతుల కుటుంబాలకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *