సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం గుడివాడలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఈ సందర్భంగా అమృత్‌ 2.0 శిలాఫలకాన్ని ఆవిష్కరించి, స్వచ్ఛ అవార్డులను అందజేశారు. గత ప్రభుత్వం కేవలం దోపిడీయే లక్ష్యంగా పనిచేసిందని విమర్శిస్తూ, ప్రజల జీవితాలతో ఆడుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో రౌడీయిజం, క్రిమినల్ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వచ్చే . అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా చెత్త రహిత రాష్ట్రంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, 2027 మార్చి నాటికి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేక ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆక్వా, పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *