సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో ముగిసిన పవన్ కళ్యాణ్ నేడు, బుధవారం భేటీ లో ఉమ్మడి జిల్లా అభ్యర్థుల ను ఖరారు చేసి వారికీ పార్టీ బి పారమ్స్ ఇచ్చి, ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాలి అని పవన్ వారిని ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై రేపు గురువారం అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తుంది. కీలకమైన భీమవరం సీటు విషయం ఫై అనేక తర్జనలు జరిగాక పులపర్తి రామాంజనేయులు ను ఎంపిక చేసారు.రేపు ఉదయం భీమవరం మల్టి ఫ్లెక్స్ లో 11గంటలకు 12 గంటలకు ఆలూరి సీతారామరాజు కళావేదిక వద్ద అభినందన సభ ఏర్పాటు చేసారని జనసేన జిల్లా అడ్జక్షులు కొటికలపూడి చినబాబు నేటి రాత్రి తెలిపారు. ఇక జిల్లాలో పక్కాగా కేటాయించిన సీట్లు… తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్,నరసాపురం – బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు – పచ్చమట్ల ధర్మరాజు ,నిడదవోలు – కందుల దుర్గేష్ వారికీ అభ్యర్థిగా పేరు ఖరారు అయినట్లు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక లెటర్ అందజేశారు. దానితో తాడేపల్లిగూడెం బోలిశెట్టి, శ్రీనివాస్ మరియు నరసాపురాని కి చెందిన బొమ్మిడి నాయకర్ అధికారిక లెటర్లు అందుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి ఫై శ్రీ కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
