సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గ పరిధిలోని ప్రతిష్టాకరమైన పాలకోడేరు సహకార సంఘం చైర్మన్ గా కొత్తపల్లి నాగరాజు నియమితులైన నేపథ్యంలో ఆయన శ్రేయోభిలాషులు కూటమి అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా .. గతంలో నరసాపురం పార్లమెంట్ కు ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కష్ట సుఖాలలో వెంట నడుస్తూ సమర్ధవంతమైన కార్యనిర్వాహకునిగా పేరుగడించారు. గతంలో కూడా సహకార సంఘం చైర్మన్ గా పనిచేసిన కొత్త పల్లి నాగరాజు కు మరోసారి రఘురామా కృష్ణంరాజు ప్రోత్సహంతో కూటమి ప్రభుత్వం గౌరవనీయ పదవి ఇవ్వడం పట్ల భీమవరం , ఉండి నియోజకవర్గాలలో హర్షం వ్యక్తం అవుతుంది. మా మిత్రులు కొత్తపల్లి నాగరాజు గారికి మరింత ఉన్నత పదవులు అధిష్టించాలని కోరుకొంటూ మన ‘సిగ్మా న్యూస్’ తరపున శుభాబినందలు తెలుపుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *