సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా నుండి పెట్రోల్ కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా పెనాలిటీలతో కలపి 50శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో భారత్ లోదేశి స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు కూడా భారీ నష్టాలను కొనసాగిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపుల కారణంగా అంతర్జాతీయంగా కూడా మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో ట్రంప్ రష్యా అడ్జక్షుడు పుతిన్ తో సమావేశం అవ్వడానికి గ్రీన్ సిగ్నెల్ రావడంతో యుద్ధం ఆగి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం భారత్ కు వచ్చే రోజులలో కాస్త సానుకాలాంశంగా కనిపిస్తోంది. కాగా, గత బుధవారం ముగింపు (80, 543)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 279 పాయింట్ల నష్టంతో 80, 264 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 78 పాయింట్ల నష్టంతో 24, 495 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌లో ఫోర్టిస్ హెల్త్, లూపిన్, పిరామిల్ ఫార్మా, గ్రాన్యుయల్స్ ఇండియా, కోఫోర్జ్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భెల్, జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్, కంటైనర్ కార్పొరేషన్, భారత్ ఫోర్జ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 111 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.71 కు దారుణంగా పడిపోయింది
