సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వినాయక చవితి ముందు రోజువరకు వరుసగా 3 రోజులు పాటు ఉత్తర ఆంధ్ర, గోదావరి జిల్లాలలో వర్షపు చినుకుల ముసురు ఆహ్లదపరచగా నిన్న నేడు బుధవారం ఎండలు దంచి కొడుతున్నాయి.అయితే మరల ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే సెప్టెంబర్ 19న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమతో సహా రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
