సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రి మోడి అధ్యక్షతన న్యూఢిల్లీలో నేడు శనివారం జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుతో సహా హాజరైన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మైక్ 5 నిమిషాలకే కట్ చెయ్యడంతో తీవ్ర ఆగ్రహంతో .. చంద్రబాబు కు మాట్లాడటానికి 20 నిముషాలు సమయం ఇచ్చారు. నాకేమో 5 నిమిషాలైనా? ఏమిటి మీ పక్షపాత ధోరణి? అంటూ ప్రధాని మోడీని కోపంతో ప్రశ్నిస్తూ ఈ చర్య బెంగాల్‌కు అవమానంగా భావించి అంతే వేగంగా సభ మధ్యలోనే వాకౌట్‌ చెయ్యడం తో అందరు విస్తుపోయారు. బయటకు వచ్చిన మమతా మీడియా తో మాట్లాడుతూ.. ఇతరులు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని, అయితే తనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి అనుమతించారని ఇది తనను, బెంగాల్‌ ప్రజలను అవమానించడమేనన్నారు. బెంగాల్‌కు నిధులు ఇవ్వాలని కోరినప్పుడు, ప్రణాళికా సంఘాన్ని తిరిగి తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల గురించి ఆలోచించాలని, వివక్ష చూపవద్దని కోరినప్పుడు తన మైక్‌ను మ్యూట్‌ చేశారని ఆరోపించారు. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *