సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క 7నెలలుగా ఇరాన్, అమెరికా యుద్ధం, మరో ప్రక్క, గత 4 ఏళ్లుగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం తీవ్ర రూపం దాల్చిన కీలక సమయంలో భారత్ వేదికగా రేపటి నుండి జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. భారత్ కు నమ్మకమైన మిత్రులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు,శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సుకు ముందు ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ద్వైపాక్షిక భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పురాతన తమిళ సాహిత్య కావ్యమైన ‘తిరుక్కురళ్’ (Thirukkural) రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అణు విద్యుత్, సాంకేతికత వంటి అంశాలు చర్చించారు.. మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కూడా ఢిల్లీ చేరుకొన్నారు.మోదీ తో సమావేశంతో ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, గల్ఫ్ యుద్ధ పరిస్థితులు, చర్చించే అవకాశం ఉందిఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్,రేపు శనివారం భారత్‌కు రానున్నారు
