సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం , ఉండి ప్రజానీకానికి ముఖ్య గమనిక .. ఈనెల 12, 13 తేదీలలో (శనివారం, ఆదివారం ) స్థానిక ఉండి హైస్కూల్ ఆవరణలో ఏలూరు ఆశ్రమ్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేస్తున్నారు అని అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామా మన సిగ్మా న్యూస్ కు తెలిపారు. ఈనెల 12న మహిళలకు గర్భ శ్రయ కాన్సర్ , రొమ్ము కాన్సర్ లు లక్షణాలు స్కానింగ్ చేసే ఆధునిక వైద్య సేవలు ఉచితంగా నిర్వహిస్తారు. తదుపరి ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండి పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు మెడిసిన్ లు అందజెయ్యడం జరుగుతుందని ప్రజలు వారి ఆరోగ్యాలు కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చారు.
