సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘సీతారామం ‘ వంటి క్లాసిక్ సూపర్ హిట్ అందించిన హను రఘువపూడి దర్శకత్వంలో.. భీమవరం బ్రాండ్, ఆలిండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన ‘ఫౌజీ’ గ్లింప్స్ గురించి సోషల్ మీడియా లో ఆసక్తికర ట్రోలింగ్ నడుస్తుంది. ఆ గ్లింప్స్ లో హిట్లర్ వద్ద పౌజి గురించి పాత సినిమాలలో మాస్ హీరోల ఎంట్రన్స్ తరహాలో ..సుభాష్ చంద్రబోస్ ఇచ్చే ఎలివేషన్లను ప్రస్తావిస్తూ.. అక్కడే ఈ సినిమా కధ అంతా అర్ధం అయిపోతుందని విశ్లేషిస్తున్నారు. అక్కడ ప్రస్తావించిన మాటలు ప్రకారం 3 ఏళ్ళ క్రితం కళ్యాణ్ రామ్ హీరో గా ‘డెవిల్’ సినిమా ఇదే తరహా కధ తో విడుదల మంచి చిత్రంగా ప్రశంసలు అందుకొంది . అయితే థియేటర్స్ లో ఆడలేదు. మూవీలో బోస్‌కు అత్యంత సన్నిహితుడు, ఐఎన్ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ త్రివర్ణ పాత్రని ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నారు. ‘డెవిల్’ చిత్రాన్ని అదే కాన్సెప్ట్‌ను యాజిటీజ్‌గా ఇక్కడ దింపేసినట్లు ఉన్నారు’ క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి కి ఇది తగునా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. సుభాష్ చంద్ర బోసు గెటప్ చూస్తుంటే బోస్లా కాకుండా అంబేద్కర్‌లా కనిపిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
