సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని గోదావరి జిల్లాలలో వరద ముప్పు పొంచి ఉంది. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్, ఒడిశా, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉపనదులైన ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరులో వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజి తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద గోదావరిలోకి వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పి ల్వే వద్ద 31.050 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో చేసేది లేక డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్వే గేట్ల నుంచి 3లక్షల15 వేల791 క్యూ సెక్కుల వరద నీటినిదిగువకు విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *