సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గిరిబాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం తెలియజేస్తున్నారు. హీరోగా నిర్మాతగా దర్శకుడు గా దేవతలారా దీవించండి, సింహ గర్జన మెరుపుదాడి, వంటి యాక్షన్ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. సూపర్ స్టార్ కృష్ణ తో అయన అనుబంధం ప్రత్యేకం.. పెళ్ళాం చిబితే వినాలి, దొంగోడొచ్చాడు, దొంగ మొగుడు, చిత్రం భళారే విచిత్రం వంటి సినిమాలలో కామిడి పాత్రలలో కూడా గిరిబాబు అద్భుతంగ రాణించారు. 600 పైగా చిత్రాలులో నటించిన తెలుగు సినిమాకు తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఓ విలక్షణ నటుడిని కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటని సినీ ప్రముఖులు రాజకీయ వేత్తలు నివాళులర్పిస్తున్నారు.
