సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా బాసిల్లు తున్న తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ముఖ్య ప్రకటన చేసింది. వచ్చే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాలకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించింది. నవంబర్ 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో విడతల వారీగా ఈ టికెట్లను విడుదల చేయడం జరుగుతుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ అంటే లక్కీ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది, శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, గదుల టికెట్లను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *