సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమౌతున్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ముగిసింది. విన్నర్ గా ప్రముఖ సింగర్ రేవంత్ నిలిచారు. రన్నర్ గా శ్రీహాన్ నిలిచారు. అయితే నిజానికి ప్రేక్షకుల తీర్పు ప్రకారం రెహాన్ కె ఓట్లు ఎక్కువ వచ్చాయి. అదే షో చివరలో హోస్ట్ నాగార్జున పేల్చిన పెద్ద పంచ్.. కాస్త వివరముగా చూసే బిగ్ బాస్ హౌస్ లో 3 గురు మిగిలినప్పుడు సీనియర్ హీరో రవితేజ హౌస్‌లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్లకు స్కూట్ కేసు లో డబ్బుసు ఆఫర్ చేశాడు. ప్రైజ్ మని లో పది శాతం మీ సొంతమని ఊదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ముప్పై శాతానికి పెంచినా సరే వద్దే వద్దన్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో రవితేజ చేసేదేంలేక కీర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్ లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. ఈసారి వారి కోసం నాగార్జున రంగంలోకి దిగాడు. గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బు ను రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ కమిట్ అయ్యాడు. ఇద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చా క నాగార్జున రేవంత్ ను విజేతగా ప్రకటించి బిగ్ బాస్ ట్రోఫీ బహుకరిం చడంతో పాటు కేవలం 10 లక్షల చెక్, 605 గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందించారు. చివరగా అందరికీ దిమ్మ తిరిగిపోయే న్యూ స్ చెప్పాడు నాగ్. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరూ విన్నర్స్ అయ్యాడన్నాడు. నిజానికి ఈ సీజన్ మిగతా సీజన్లతో పోలిస్తే పెద్దగా పేక్షక ఆదరణ పొందలేదు.. అదే పెద్ద ట్విస్ట్..
