సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో బీసీ సంఘాల ముఖ్య నేతలు నేడు, గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా డీసీఎంఎస్ చైర్మన్ వెంకటస్వామి మాట్లాడుతూ..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు అగ్రతాంబూలం పొందుతున్నారని, 18 మంది ఎమ్మెల్సీలకు 11 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గతంలో రాష్ట్ర చరిత్రలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేనని, ఇప్పుడు తనయుడు,సీఎం జగన్ కే దక్కిందని స్పష్టం చేశారు. జాతీయ బిసిల సంక్షేమ జిల్లా అడ్జక్షుడు కోడె యుగంధర్ మాట్లాడుతూ.. బీసీల పక్షపాతి గా జగన్‌ పాలన బీసీలందరిలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. బీసీలకు దాదాపు 60 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు. జగన్ ప్రభుత్వానికి బీసీలు అండగా నిలవాలన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపిస్తాననడంలో ఎలాంటి సందేహం లేదని మా బిసిల అందరి మద్దతు ఆయనకే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కామన నాగేశ్వరరావు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, జాతీయ మాజీ ఏఎంసీ చైర్మన్‌ తిరుమణి ఏడుకొండలు, రాష్ట్ర రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేవూరి గోగురాజు, రాష్ట్ర తూర్పు కాపు సంఘం నాయకులు ముల్లి నరసింహారావు, సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కోడె విజయలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ కడలి ధర్మారావు, మావుళ్లమ్మ దేవస్థానం డైరెక్టర్ చెల్లంకి గిరి, సోమేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ చెల్లబోయిన సూర్యప్రకాశరావు, బొక్కా గోపి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *