సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ లోని ముంబయి దాడుల సూత్రధారి, కాశ్మిర్ లో అమాయక హిందువుల ప్రాణాలు తియ్యడానికి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లోని భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరేతోయిబా చీఫ్ (Lashkar-e-Taiba chief), పరమ దుర్మార్గుడు హఫీజ్ సయీద్ (Hafiz Saeed)కు పాకిస్తాన్ (Pakistan) భారీ భద్రత కల్పిస్తోంది. పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడింది లష్కరేకు చెందిన ఉగ్రవాదులే. పహెల్గాం దాడి తర్వాత భారత్ ప్రతీకారం తప్పదని భావించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. ఇన్నాళ్లూ హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నాడని పాక్ బుకాయిస్తూ వస్తోంది. కానీ హఫీజ్ మాత్రం దర్జాగా తన నివాసం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హఫీజ్ సయీద్ భద్రతనుగతంలో కన్నా భారీ స్థాయిలో పెంచిన పాక్ ప్రభుత్వం.. హఫీజ్ నివాసానికి 4 కి.మీ. మేర హై రిజెల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
