సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానేర్ లో ప్రశాంతి తిపిర్నేని తో కలిసి నిర్మించిన గత 3 చిత్రాలు హిట్ , హీట్ 2, ఇటీవల ‘కోర్ట్’ భారీ స్థాయిలో కాకపోయినా విజయాలు అందుకొన్నాయి. ఇంతవరకూ ‘హిట్’ (Hit) ఫ్రాంచైజ్ లో విశ్వక్ సేన్, అడవి శేష్ హీరోలుగా నటించగా, ఇప్పుడు థర్డ్ కేసుతో నానీనే రంగంలోకి దిగాడు. డైరెక్టర్ శైలేష్ కొలను ‘హిట్ -3’లో నాని ని అర్జున్ సర్కార్ గా హింసాత్మక పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకొనివచ్చాడు. ఇక సినిమా కధ విషయానికి వస్తే.. అర్జున్ సర్కార్ (నాని) వైజాగ్ హిట్ టీమ్ లో ఎస్.పి.. వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు వ్యక్తులు ఒకే తరహాలో రెండు హత్యలు చేస్తారు.ఆ కేసును అర్జున్ సర్కార్ చేపడతారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఈ సైకో వ్యక్తుల మోటో ఏమిటీ? వాళ్ళు ఎందుకింత క్రూయల్ గా మనుషులను చంపుతున్నారు? అనే దానిపై తన అసిస్టెంట్స్ వర్ష (కోమలి ప్రసాద్ , దివాకర్ (చైతు జొన్నలగడ్డ) సాయంతో బాస్ నాగేశ్వరరావు (రావు రమేశ్ ) ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తాడు. కథ శ్రీనగర్ నుండి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్ కు హత్య కేసులపై సాగుతుంది. ఈ హత్యల వెనుక సి.టి.కె. కాప్చర్ టార్చర్ కిల్అనే డార్క్ వెబ్ సైట్ ఉందని తెలుసుకుంటాడు. అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన ప్రియురాలు మృదుల (శ్రీనిధి శెట్టి ) అతనికి కేసులో ఎలా సహకరించింది? అనేదే ‘హిట్ -3’ కథ. ఇది హీరో నానికి చాలా చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ . బాగా నటించడానికి ప్రయత్నం అయితే చేసాడు. సినిమా లో అన్ని పాత్రలు నటీనటులు చక్కగా చేసారు.. అయితే హీరో నాని ఇటీవల దసరా తరువాత మాస్ క్యారెక్టర్స్ పోషిస్తూ స్టార్ హీరో ఇమేజ్ సంపాదించాలని హీరో నాని చేస్తున్న ప్రయోగాల కు పాక్షిక విజయాలే లభిస్తున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ని మాస్ రోల్స్ లో ప్రేక్షకులు పూర్తిగా అంగీకరించడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసిన నాని సినిమాలు ప్రమోషన్ ఖర్చులు కూడా రావడం లేదు. మరి ‘యానిమల్’ స్థాయిలో పూర్తీ రక్తపాతంతో సైకో గ్యాంగ్ చేసే అరాచకాలుతో వారితో వారికంటే క్రూరంగా ప్రవర్తించే అధికారిగా నాని చేసిన ఊచకోతకు క్లయిమాక్స్ ఫైట్ వరకు‘ కధకు మించి’ హింస, అరాచకం “అతి” చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ప్రచారం జరిగినట్టే ఏసీపీ వీరప్పన్ గా కార్తీ సర్ ప్రైజ్ చేశాడు. షాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫీ, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ గా నిలిచాయి.
