సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అయితే అనుకొన్న సమయం కన్నా కాస్త ఆలస్యంగా 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నేటి శనివారం ఉదయం లాంచ్ ప్యాడ్ నుండి రాకెట్ బయలుదేరే కొద్ది నిమిషాల ముందు సిస్టమ్స్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని తాత్కాలికంగా ఆపేశారు. అయితే మధ్యాహ్నం 12:05 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. మొత్తానికి దేశంలోని ‘ప్రెవేటు’ రంగం తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది.
