సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి స్టార్ హీరో ప్రస్తుత క్రెజి నటుడు జగపతి బాబు హీరోగా ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతగా ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో “వదలా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ డిఫరెంట్ గా రీచ్ లొకేషన్స్ లో ఉండి బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా కధ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్య వృత్తిలో ఉన్న యోగి సిద్ధార్థ్ (జగపతి బాబు), తన ఇల్లాలు ప్రియ (లయ), బిడ్డలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అంతా ఆనందంగా సాగుతున్న సమయంలో, ఓ ప్రమాదం కారణంగా అముద (హ్రితిక శ్రీనివాస్) అనే యువతి వారి కుటుంబానికి దగ్గరవుతుంది. సైకాజికల్ గా దెబ్బ తిన్న ఆమె రాకతో వాళ్ల ప్రశాంత జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఆ అమ్మాయి నేపథ్యం ఏమిటి? వారి జీవితాల్లోకి ఆమె ఎందుకు అడుగుపెట్టింది? ఆమెకూ, నివాస్ (శ్రీనివాస్ అవసరాల) అనే వ్యక్తికీ ఉన్న సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. ఇక విశ్లేషణ కు వస్తే.. 2 గంటల లోపు నిడివి ఉన్న ఒక విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఉత్కంఠను దర్శకుడు చాలా నేర్పుగా నడిపించాడు. ముఖ్యంగా యోగి, అముద మధ్య వచ్చే సన్నివేశాలు మానవ సంబంధాలలోని ప్రేమ కోసం తపించే సున్నితమైన కోణాలను, ఎవరూ ఊహించని భావోద్వేగాలను లోతుగా ఆవిష్కరించాయి. మొదటి భాగంలో భార్యాభర్తల మధ్య చూపించిన ప్రేమ సన్నివేశాలు ఒక పాట చక్కగా కుదిరాయి. కుటుంబం కోసం తపించే తండ్రిగా, బాధ్యతాయుతమైన వైద్యుడిగా ‘జగపతిబాబు’ నటనలో తన సత్తా మరోసారి చూపించారు.అలాగే మంచి పిట్ గా ఇంకా ‘హీరో’ మెటీరియల్ గానే ఉన్నాడు. అతని కోసం తపిస్తూ వెంటాడే యువతిగా ‘హృతిక ‘ నటన సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథను పూర్తిగా ఎమోషనల్‌గా మలుపు తిప్పారు.ఆ పాయింట్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ విభిన్న సినిమాలు చూడాలి అనుకున్న వాళ్లకు మాత్రం ఓకే అనిపిస్తుంది. చోటా కే నాయుడు కెమెరా పనితనం బాగుంది.. ఎడిటింగ్ బాగుంది. . వదలా’ చిత్ర నిర్మాణ విలువలుతో ఉన్నంతలో రిచ్ గానే తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *