సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు, ఆ తర్వాత ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్: క్రితం ముగింపు (83,919.71) తో పోలిస్తే ఉదయం 84,421.97 వద్ద భారీ లాభాలతో మొదలై, ఇంట్రాడేలో 84,662.96 గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలల్తో ఏకంగా దాదాపు 1,200 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ: ఉదయం 25,929.15 వద్ద మొదలై, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి 25,650 వద్దకు చేరింది ఉదయం సానుకూలంగా మొదలైన మార్కెట్ తర్వాత ఒత్తిడికి గురైంది. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల వెల్లువతో బ్యాంక్ నిఫ్టీ 2 శాతానికి పైగా కుప్పకూలింది.
