సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన అసంఘటిత కార్మికుల పథకం మరియు బాలల హక్కుల పరిరక్షణ పధకాలపై మండల న్యాయ సేవా సంస్థ, రెవిన్యూ, మునిసిపల్, పోలీసు, DRDA, లేబర్, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ, విద్య, వైద్య తదితర శాఖల సమన్వయంతో రేపు శనివారం (ఈనెల 18న) SRKR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించబోయే న్యూ మాడ్యుల్ లీగల్ సర్వీస్ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించుటకు నేడు, శుక్రవారం ఉదయం చిన అమిరం వద్ద వున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి స్థానిక అంబేద్కర్ చౌక్లో వున్న అంబేద్కర్ విగ్రహం వరకూ 2k ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరియు సంస్ధ చైర్మన్ Dr. B.లక్ష్మి నారాయణ మరియు న్యాయమూర్తులు M.సుధారాణి, G.సురేష్ బాబు, P.హనీష, N.జ్యోతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు Y.యోహాను (న్యూటన్), న్యాయవాదులు, జాయింట్ కలెక్టర్ T.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి B.S.N.రెడ్డి, RDO ప్రవీణ్ కుమార్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ K.రామచంద్ర రెడ్డి, జిల్లా లేబర్ అధికారి A.లక్ష్మి, విద్యా శాఖ జిల్లా అధికారి నారాయణ, DRDA ప్రాజెక్టు డైరక్టర్ M.S.S.వేణు గోపాల్, ట్రైబల్ జిల్లా అధికారి D.పుష్ప రాణి, DCPO రాజేష్, పోలీస్ టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్, సబ్ ఇన్స్పెక్టర్లు, తదితర శాఖల అధికారులు, సంఘ సేవకులు పాల్గొని అసంఘటిత కార్మికులు, బాలల హక్కుల కొరకు నినాదాలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *