సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలోని స్థానిక త్యాగరాజ భవనం వద్ద పులవర్తి వారి విడిది ఇంటిలో స్థానిక భక్తులందరి సహకారంతో పుట్ట మన్నుతో కోటి శివలింగాల తయారీ అనుకున్న లక్ష్యానికన్నా ఎక్కువగా శివలింగాలను తయారుచేసి ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా రాజమహేంద్ర వారంలో శ్రీ బోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారికి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల నుండి ఈ కోటి శివలింగాలు తయారీ పూర్తీ అయ్యాక కార్తీక మాసంలో మంచి ముహూర్తం నిర్ణయించి పవిత్ర యజ్ఞం నిర్వహించి వాటిని గంగ లో నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో వారు ఈనెల 26వ తేదీ వరకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 7:00 వరకు ప్రోగ్రాం పొడిగిస్తున్నట్లు పులవర్తి సాయి మణి దంపతులు తెలియజేస్తున్నారు .వారికి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్త బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
