సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోను భీమవరం టీడీపీ, జనసేన కార్యాలయాలలోను, అలానే ఉండి నియోజకవర్గానికి చెందిన భీమవరంలోని టీడీపీ కార్యాలయంలోనూ ( ఎమ్మెల్యే మంతెన రామరాజు, కలవపూడి శివ పాల్గొన్నారు.) స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం వద్ద వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జాతీయపతాకాలు ఎగురవేసి స్వతంత్ర సమర యోధులకు ఘన నివాళ్లు అర్పించారు. వైసిపి కార్యాలయంలో భారీగా హాజరు అయిన వైసిపి నేతల సమక్షంలో జాతిపిత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పుష్పమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.మిఠాయిలు పంపిణి చేసారు. ప్రభుత్వ విప్, గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు స్వతంత్ర సమరం చేసి ఎన్నో త్యాగాలు చేసి సాధించిన ఈ భారత స్వతంత్ర దేశాన్ని పాలించడానికి ప్రజలందరికి రాజ్యాంగ హక్కులు కల్పిస్తూ వెనుకబడిన వర్గాలను ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహం అందించేలా ప్రజా స్వామ్య పాలన కు డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని , స్వతంత్ర సమార యోధుల త్యాగాలకు భారత జాతి ఎప్పటికి రుణపడి ఉంటుందన్నారు.ఇదే స్ఫూర్తి ని సీఎం జగన్ ఏపీలో తన పాలన లో అమలు చేస్తున్నారని అన్నారు.
