సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు భీమవరం రావడం ఇక్కడ జనసేన క్యాడర్ తో మమేకం కావడం మునిసిపల్ ఎన్నికలకు జోష్ నింపింది. . భీమవరం విచ్చేసిన నాగబాబు కు స్థానిక జనసేన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సమావేశానికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, టీడిపి ఇంచార్జి, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, భీమవరం మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి జనసేన అభ్యర్థి డా చుండూరి మల్లేశ్వరి, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి తో పాటూ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చెయ్యాలని జనసేన కు కూటమి లోని పార్టీలకు ఎటువంటి విభేదాలు లేవని క్యాడరు కూడా కలసికట్టుగా ముందుకు వెళ్లాలని నాగబాబు పిలుపు ఇచ్చారు.
