సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌ గా ఇందుకూరి రామకృష్ణంరాజు, ఉప చైర్మన్‌ గా సిరగాని నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులు భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా పరిషత్ సభ్యులందరితో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఇంచార్జి జిల్లా కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో ప్రజాసేవే లక్ష్యంగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు మరియు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అభినందించి సత్కరించారు. తదుపరి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన గణపవరం TDP జెడ్పీటీసీ సభ్యులు ఇందుకూరి రామకృష్ణ రాజు , శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజుని మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *