సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు, స్వతంత్ర భారతదేశపు తొలి పరిశ్రమల శాఖ మంత్రి డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని ముఖర్జీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు అని నినదించి, కాశ్మీర్ పూర్తి స్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని మంత్రి గుర్తుచేశారు. ఆయన కన్న కలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, కాశ్మీర్‌ను భారతదేశంలో శాశ్వతంగా అంతర్భాగం చేసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశేషంగా బీజేపీ నేతలు పాల్తోనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *