సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ,మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం ప్రకాశంచౌక్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ,టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి , ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తో పాటు వక్తలు మాట్లాడుతూ .. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ చలనచిత్ర సీమను వదిలి రాజకీయ నాయకునిగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అమలుచేసి అవినీతిని నిర్మూలించి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణం ప్రధాన కూడలి ప్రకాశంచౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకం అన్నారు.ఈ కార్యక్రమంలో విశేషంగా టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
