సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు శ్రీ వినాయక చవితి సందర్భములో నేడు, అత్యంత సుందరంగా పుష్ప అలంకరణతో శోభిల్లింది. దీనికి గునుపూడి వాస్తవ్యులు జనసేన నేత , స్థానిక హోసింగ్ బోర్డు శ్రీ వెంకట సాయిబాబా ఆలయం నిర్మాణ వ్యవస్థాపక ఛైర్మన్ మల్లినీడి తిరుమలరావు(బాబి) ఆధ్వర్యంలో .. ధ్వజ స్తంభం మొదలు ఆలయంలోని అన్ని ఉప ఆలయాలతో సహా విభిన్న పుషకృతులతో అలంకరణలు చేసారు. తదుపరి బాబిచే శ్రీ వినాయక స్వామి వార్కి పూజా కార్యక్రమములు నిర్వహించటమైనది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వార్ని దర్శించుకొని యున్నారు. అని దేవాలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు .ఒక ప్రకటనలో తెలిపారు.
