సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న.. ఇరగవరం’ జడ్పీటీసీ అభ్యర్థితో పాటు 17 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ బి-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *