సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం కోర్టుల్లో పెండింగులో వున్న కేసుల పరిష్కారం నిమిత్తం ఈ సంవత్సరపు మొదటి జాతీయ లోక్ అదాలత్ ను భీమవరంలో వున్న అన్ని కోర్టుల ప్రాంగణంలో మార్చి నెల 14వ తేది (రెండవ శనివారం) నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ మరియు మూడవ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr.B. లక్ష్మీనారాయణ అన్నారు. దీనిలో అన్ని సివిల్ కేసులు, రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంటు ఇన్సూరెన్స్ కేసులు, ప్రాంశరీ నోటు, చెక్కు బాకీ కేసులు, మనోవర్తి, గృహహింస కేసులు, బ్యాంకు, BSNL మొండి బాకీ కేసులు తదితర కేసులు రాజీ చేసుకొనే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *