సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం గునుపూడిలోని సోమగుండం చెరువు వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మొక్కలను నాటారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమం ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడంతో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. మొక్కల సంరక్షణతోనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందడమే కాకుండా సకాలంలో వర్షం కురుస్తుందని అన్నారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి, లతో పాటు టీడీపీ, జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు.
