సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా నేడు, శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె నేడు కొండపై మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అసమర్ధత తో గత 3 నెలలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేప్ లు, మర్డర్లు జరుగుతున్నయి. ఆడపిల్లల కాలేజీల బాత్రూంలో హీడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. హిడెన్ కెమెరాలు పెట్టారని వందలమంది ఆడపిల్లలు పిర్యాదు చేస్తే ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. నేరస్తులకు ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు జరగాలంటే ఎంతో భయం ఉండేదని రోజా అన్నారు. ఇటీవల ముచ్చుమర్రి ఘటనలో తొమ్మిదేళ అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలు చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గాని వెళ్లలేదు.ఇటీవల నారాయణ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి చంపేశారు. కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థి చనిపోయారు. ఐదుసంవత్సరాలలోలేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. బెదిరిపులకు లొంగక 2రోజులుగా ఆడపిల్లలు న్యాయం కావాలని ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు.
