సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు, శుక్రవారం రెస్ట్ హౌస్ రోడ్డులో వరద గండ్లు కు అవకాశం ఉన్న యనమదుర్రు డ్రెయిన్ గట్టు ప్రాంతాలను పరిశీలించారు. నీట మునిగిన లోతట్టు ప్రాంతంలో జనరేటర్లుతో నీటిని తోడిస్తున్నామని, ఇసుక గుట్టలను కూడా వేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ముంపు ప్రాంత బాధితుల కోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని అన్నారు. అయన పర్యటనలో మాజీ కౌన్సెలర్స్ విజ్జురోతి రాఘవులు ,మైలబత్తుల ఐజాక్ బాబు, లతో పాటు సతివాడ నవీన్, లంకి చిన్ని, గొలగని రమేష్ ముచ్చకర్ల శివ, కొండ్రు శ్రీనివాస్, ఫణి, తిరుమాని మోహన్ రావు, నాగబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
