సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారు దసరా వేడుకలలో భాగంగా నేడు, మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. . నేటితో అవతారాలు ముగింపు విజయదశమి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించారు. భారీ క్యూ లైన్ లలో కిలో మీటెర్ మేర నిలబడినప్పటికీ భక్తులు ప్రశాంతంగా శ్రీ అమ్మవారి దర్సనం చేసుకోవడం విశేషం. అలాగే భీమవరం పంచారామ క్షేత్రం లోను, యనమదురు కాల్వ వారగా డి ఎన్ ఆర్ కాలేజీ రోడ్ లోని శ్రీ దుర్గ లక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద పెదమిరం లోని శ్రీ షిర్డీ సాయి స్వర్ణ మందిరం లోను వేలాది భక్తులు పోటు ఎత్తారు. అన్నసమారాధ నలు పెద్ద ఎత్తున జరిగాయి.
