సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున ఇండియన్ బ్యాంకు రోడ్డు లో ( సిగ్మా న్యూస్ కార్యాలయం వద్ద)సుమారు 150 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన మహిమ కలిగిన ‘శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి సంబర మహోత్సవాలు ఘనంగా ముగిసాయి.. సుమారు శతాబ్దం కాలంగా కాలం మారుతున్నా.. ప్రతి ఏడాది ఆచారం ప్రకారం ఇక్కడ నిప్పుల గుండం ఏర్పాటు చేసి భక్తులు త్రొక్కడం హైలైట్.. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి కర్ణి భక్తులు ఆధ్వర్యంలో మహర్నవమి రోజు సంబరం నిర్వహిస్తూనే ఉంటారు. మహర్నవి ఉదయం నుండి భక్తుల కోలాహలం తో ప్రారంభమైన ఈ సంబరం నిన్న విజయదశమి రోజుతో ముగిసింది. . మహర్నవి రాత్రి 7గంటల నుండి శ్రీ స్వామివారికి మేళతాళాలతో , మంటలతో శూలాలతో వీర శైవ నృచాలు ,డప్పు వాయిద్యాలకోలాహంతో సంబరం నిర్వహించారు. తమ సమస్యలు, కష్టాలు గట్టెక్కాలని కోరుకొంటూ ఇక్కడ ఉదయం నుండి ఉపవాస నిష్ఠ తో ఉన్న భక్తులు రాత్రి 10 గంటలకు ఏర్పాటు చేసే నిప్పుల తొక్కారు.. తదుపరి రాత్రి 11 గంట నుండి నంది వాహనం ఎక్కి శ్రీ వీరభద్ర స్వామి భద్ర కాళికా దేవి సమేతుడై కాగడాలతో,మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ప్రభలు వెంటరాగా స్వామివారు నగర సంచారం చేసి నిన్న తెల్లవారు జామున దేవాలయం కు తిరిగి రావడం జరిగింది. తదుపరి నిన్న డప్పు వాయిద్యాలు తో మహా నైవేద్యం సమర్పణ తో సంబరం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *