సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున ప్రవహించే యనమదుర్రు కాలువపై తోకతిప్ప వద్ద సుమారు రూ. 8 కోట్లతో నిర్మించిన వంతెనకు ప్రధాన రోడ్లను కలుపుతూ అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులకు నేడు, ఆదివారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, టీడీపీ నేతలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధసారధి తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల క్రితమే యనమదుర్రు కాలువపై మూడు వంతెనల నిర్మాణం పూర్తయినప్పటికీ, అప్రోచ్ రోడ్లు లేకపోవడం వల్ల అవి ఇన్నాళ్లూ నిరుపయోగంగా మిగిలిపోయాయన్నారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఈ అప్రోచ్ రోడ్ల ఆవశ్యకతను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి, పనుల నిమిత్తం రూ. 31 కోట్లు మంజూరు చేయించారని ప్రశంసించారు. ఈ మూడు , వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి, ప్రజల రాకపోకలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తమని, . అలాగే జాతీయ రహదారి 165 కు సంబంధించి ఉన్న న్యాయపరమైన చిక్కులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చేరుతాయని, తద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని శ్రీనివాస వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *