సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతుతో ఎన్డీఏ కూటమి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రక విజయం సాధించడం ఖాయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు.. భీమవరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నర్సయ్య అగ్రహారంలోని ఏఆర్కేఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 4వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించు కున్నారు.
