సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ‘కోపా‘కళ్యాణ మండలంలో నేడు, శనివారం ఓజస్వి, ఒమిక్స్ డయాగ్నోస్టిక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ప్రజలకు పలు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో కోపా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
