సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు, శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 106వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. భీమవరం, తాడేపల్లి గూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాలలో ఆయన విగ్రహాలకు పుష్ప మాలలు వేసి స్థానిక బిసి సంఘాల ప్రముఖులు నివాళ్లు అర్పించారు. ఈ నేపథ్యంలో తణుకులో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాంతం కులవివక్ష, అంటరానితనం,సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని, మూఢనమ్మకాలు, సామాజిక అసమానత లకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బొద్దాని నాగరాజు,సికిలే పుష్పకుమారి, సీపీఐ తణుకు పట్టణ సమితి సభ్యులు పాల్గొని నివాళులర్పించారు.
