సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలలో పెద్దోడు చిన్నోడు ఎవరంటే ఎవరైనా యిట్టె చెప్పేసారు. వారి బ్రాండ్ సినిమాకే పరిమితం కాలేదు. ఇప్పుడు I MAX సినిమా థియేటర్స్ వ్యాపార భాగస్వామ్యం కు కూడా విస్తరించింది. విక్టరీ వెంకటేష్. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మరియు ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ విక్టరీ సినిమాస్ (AMB Victory Cinemas / AMB Classic Victory) పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త ఐమాక్స్ (IMAX) సినిమా ను చూపేందుకు మల్టీప్లెక్స్ సిద్ధమవుతోంది. గతంలో హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ ఉన్నప్పటికీ 2015 తర్వాత ఐమాక్స్ సినిమాలు నిలిపివేశారు. అంటే 10 ఏళ్ళ తరువాత హైదరాబాద్‌కు పెద్దోడు చిన్నోడు కల్సి తిరిగి ఐమాక్స్ ను తీసుకొనివస్తున్నారు. అది కూడా వాళ్ళిద్దరి సినిమాలకు అచ్చొచ్చిన ( బొబ్బిలిరాజా 300 రోజులు డైరెక్టుగా ఆడింది. మహేష్ సూపర్ హిట్ సినిమాలకు అడ్రస్) ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పాత సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలం లోనే నిర్మించారు. మొత్తం 7 స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి. IMAX తో లేజర్ స్క్రీన్ మరియు స్పష్టమైన 4K విజువల్స్ మరియు శక్తివంతమైన సౌండ్ సిస్టమ్‌తో). 4DX స్క్రీన్ మరియు మరో 5 సాధారణ స్క్రీన్లు ఉంటాయి. వచ్చే డిసెంబర్ 18, 2026న IMAX ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . తొలి సినిమా: హాలీవుడ్ చిత్రం డ్యూన్: పార్ట్ త్రీ (Dune: Part Three) ఈ స్క్రీన్‌పై ప్రదర్శించే తొలి సినిమాగా ప్రచారంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *