సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ట్రాఫిక్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వన్ టౌన్, రెండవ పట్టణ పోలీస్ సిఐలు అడబాల శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాస్, ఎస్సై అప్పారావులతో సమీక్షించారు. ఆయన వారితో.. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వారి పనుల నిమిత్తం నిత్యం వేలాది ప్రజలు భీమవరం వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ సహకారంతో పట్టణంలో అండర్ టన్నెల్స్ ను నిర్మించడం జరిగిందని అన్నారు. వీటివల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకేసమయంలో స్కూల్ బస్సులు కూడా ఎక్కువగా వెళుతున్న నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *