సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉత్తరాంధ్ర లో వారాహి యాత్ర ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజగా.. విదేశాలకు వెళ్లారు. ప్రతి ఏడాది తన పుట్టిన రోజుకు కొద్దీ రోజులు అందరికీ దూరంగా ఉండే అలవాటు ఉన్న పవన్ . ఈసారి విదేశాలకు వెళ్లారని తెలుస్తోం ది. విదేశీ యాత్ర ముగించుకొని హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 5న వస్తారని సమాచారం . ఉస్తాద్ సినిమాకు మొత్తం 60 రోజులు షూటింగ్ ఉంటుంది. ఈసినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే స్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. . అక్టోబర్లో ఇరవై రోజులు OG సినిమా మీద వర్క్ చేస్తారు. ఓజి లేదా ఉస్తాద్ లలో ఒక సినిమా సంక్రాంతి పండుగ బరిలో దింపే యోచనలో ఉన్నారు.
