సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం – విస్సా కోడేరు వంతెన పాత గోపీకృష్ణ థియేటర్ వద్ద నుండి ఎస్ఆర్ కేఆర్ కళాశాల వరకు నేడు, మంగళవారం కూటమి ప్రజాప్రతినిధులు నేతలు ఎన్నికల ప్రచార బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, నసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావుతో పాటు చైర్మన్ అభ్యర్థి డా మల్లేశ్వరి మాట్లాడుతూ.. కూటమి పార్టీల క్యాడర్ పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పాలకవర్గం మున్సిపాలిటీలో ఉంటే జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని, భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. పట్టణంలో విలీన గ్రామాల్లోనూ సమగ్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *