సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం నందు నేడు, మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు మరియు వేదపండితులు చండీహోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 85 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు మరియు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ కి స్థానిక భక్తులు చింతలపాటి శ్రీవర్మ పూజ రాజేశ్వరి దంపతులు 16 గ్రాములు బంగారం కానుకగా సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి పూజ ఆశీర్వచనం అందించగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారు.
