సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుడివాడ మీదుగా విజయవాడ ప్రయాణించే భీమవరం పరిసర ప్రాంత ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై సుమారు 110 కిలో మీటర్ల దూరానికి 2న్నర – 3 గంటల పైగా సమయం పట్టదు.. విజయవాడ – గుడివాడ మార్గంలోని బ్రాంచ్ లైన్‌లో గతంలో సింగిల్ లైన్ కావడంతో ఎదురుగా మరో రైలు వస్తే ఎక్కడపడితే అక్కడ నిలిపేసేవారు. దీనితో హైదరాబాద్ నుండి మన ప్రయాణికులు విజయవాడ వచ్చేశాము అనుకునేలోపే రాత్రివేళ్లలో ఔటర్లలో రైళ్లు నిలిపేసేవారు. అయితే, ఇకపై ఎలాంటి ఆలస్యం ఉండదు.. ఎందుకంటే ఇప్పటి వరకు సింగిల్ లైన్ ఉన్న ట్రాక్‌ను, డబుల్ లైన్ చేసేశారు. సాధారణంగా విజయవాడ నుంచి గుడివాడకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంట పైగా , ప్యాసింజర్ అయితే గంటన్నర లేదా 2 గంటలు పైనే సమయం పట్టేది. ఇకపై అంత సమయం వేచి చూడాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. రూ. కోట్లు వెచ్చించి డబుల్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో ప్రయాణికులు వేగంగా తమ గమ్యాలను చేరుకోవచ్చు.. ప్రస్తుతం ఎంఈఎంయూ రైళ్లు గంట వ్యవధిలో వెళ్తుండగా, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 45 నిమిషాలకు గమ్య స్థానం చేరుకుంటున్నాయి. ఇకపై ఈ బ్రాంచ్ లైన్ పరిధిలోని మెయిన్ రైల్వే స్టేషన్లలో గుడివాడ, మచిలీపట్నం, నరసాపురం, భీమవరం, నిడదవోలు అదనంగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సరుకు రవాణాకు అదనపు రైళ్లను నడిపి ఆదాయాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *